అక్టోబర్ 27 న చరిత్రలో ఈరోజు..
🌕 జననాలు 🌕
1811: కుట్టు మిషను రూపకర్త ఐజాక్ మెరిట్ సింగర్ జననం (మ.1875).
1858: థియోడర్ రూజ్‌వెల్ట్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (మ.1919)
1904: జతీంద్ర నాథ్ దాస్, స్వతంత్ర సమరయోధుడు, విప్లవవీరుడు. (మ.1929)
1917: జోతి వెంకటాచలం కేరళ గవర్నరుగా, తమిళనాడు రాష్ట్ర మంత్రిగా పనిచేసిన రాజకీయ నాయకురాలు. పద్మశ్రీ పురస్కార గ్రహీత.
1928: భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు దత్తా గైక్వాడ్ జననం
1939: చలసాని ప్రసాదరావు, రచయిత, చిత్రకారుడు. (మ.2002)
1942: ఎన్.గోపాలకృష్ణ, తెలుగు చలన చిత్ర దర్శకుడు ,రచయిత.
1952: అనురాధ పౌడ్వాల్ , భారతీయ నేపథ్య గాయని , పద్మశ్రీ అవార్డు గ్రహీత
1966: భారత దేశానికి చెందిన చదరంగ క్రీడాకారుడు దివ్యేందు బారువా జననం.
1977: శ్రీలంకకు చెందిన క్రికెట్ క్రీడాకారుడు కుమార సంగక్కర జననం.
1984: భారత క్రికెట్ క్రీడాకారుడు ఇర్ఫాన్ పఠాన్ జననం.
1988: శ్రీకాంత్ ముంధే, భారతీయ ఫస్ట్-క్లాస్ క్రికెటర్.
💥 మరణాలు 💥
1605: అక్బర్, మొఘల్ చక్రవర్తి. (జ.1542)
1795: సవాయ్ మాధవ రావ్ II నారాయణ్ మరాఠా సామ్రాజ్యంలో 14వ పేష్వా (జ.1774)
1914: బెల్లంకొండ రామరాయ కవీంద్రుడు, కవీంద్రుడు, పండితులు, కవి శిఖామణి.
1940: కొమురం భీమ్, హైదరాబాద్ విముక్తి కోసం అసఫ్ జాహి రాజవంశానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)
1955: బి వి.రామానందo, తెలుగు సినిమా దర్శకుడు(జ.1902).
1986:కొసరాజు, తెలుగు సినిమా పాటల రచయిత, కవి, రచయిత. (జ.1905)
🪴 పండుగలు , జాతీయ దినాలు 🪴
పదాతి దళ దినోత్సవం.
ఆక్యు పేషనల్ థెరపీ డే