janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 3:56 pm Digital Edition : JANAM VOICE

అధికారం కోసం ఎన్నేళ్లైనా ఆశ చూపుతనే ఉంటరు.- మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌.

అధికారం కోసం ఎన్నేళ్లైనా ఆశ చూపతనే ఉంటరు…
– రాష్ట్రంలో అప్పులు చేసి ఢిల్లికీ మూటలు మోస్తాండ్లు
– మంత్రి హోదాలో ఉండి నలుగురి సాయం చేయని ఎమ్మెల్యే శ్రీధర్‌ బాబు
– 24నెలల్లో కనీస అవసరాలు తీర్చలేదని ప్రజలు అర్థం చేసుకుండ్లు
– గ్రామాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలే తిరుగలేని పరిస్థితులు ఏర్పడ్డయ్‌
– మన ఊరు …మన రాష్ట్ర పార్టీ అంటే బీఆర్‌ఎస్‌ పార్టీనే
– అధికార పార్టీ వదిలి వచ్చినోళ్లు చరిత్రలో నిలిచిపోతరు
– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

జనం వాయిస్ దినపత్రిక, మంథని:

ప్రజలకు హమీల ఆశలు చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, పాలకులు ఇంకా ఎన్నేళ్లయినా గవే ఆశలు చూపుతారే తప్ప ఏ ఒక్కటి నెరవేర్చరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. మంథని పట్టణంలోని రాజగృహాలో బుధవారం మల్హర్‌ మండలం అన్‌సాన్‌పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాసర్ల రాజయ్య, మాజీ సైనికుడు భనోత్ రాజు కుమార్ (డిల్లీ రాజు), లావుడ్య రాణా సింగ్,ఇంజపూరి కుమార్ యాదవ్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధరంసోత్ లక్ష్మణ్ నాయక్, నాంసాని కుమార్ యాదవ్, లావుడ్య రాజు, తోట్ల సమ్మయ్య, జంగ పెద్ద అయిలయ్య, తోట్ల ఓదెలు, భనోత్ సింగనాయక్, లావుడ్య తిరుపతి, గుగులోత్ చిన్న రాజు, లావుడ్య రవీందర్, గుగులోత్ రాజేష్, లావుడ్య శ్రీధర్, లావుడ్య తరుణ్, భూక్య రాజేష్, లావుడ్య సతీష్, లావుడ్య నరేష్, తొట్ల కుమార్ యాదవ్, బానోత్ తిరుపతి, లావుడ్య శ్రీనివాస్, సజ్జల శ్రీకాంత్, సజ్జల గణేష్, బూడిది రమేష్, అజ్మీరా శివాజీ, గుగులోతు ప్రశాంత్, భూక్యా శ్రీనివాస్, గుగులోత్ దేవేందర్ మరియు పెద్ద ఎత్తున సుమారు వంద మంది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన గ్రామశాఖ, యూత్‌ కాంగ్రెస్‌, సీనియర్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు.

ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ 24నెలల కాలంలో కాంగ్రెస్‌ పనితీరును ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు పాలించిన కేసీఆర్‌ అప్పు చేసైనా పప్పు కూడు పెట్టిండని, కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అప్పులు చేసి ఢిల్లీకి మూటలు మోసుకుపోతుందని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 24 నెలలు గడుస్తున్నా రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి, ఇక్కడ ఎమ్మెల్యే శ్రీధర్‌లు కనబడకుండా కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇచ్చిన హమీలను తుంగలోతొక్కారని ఆయన ఎద్దేవా చేశారు. నమ్ముకున్న కార్యకర్తలు తమ ప్రభుత్వం వస్తే ఏదోచేస్తామని ఆశపడితే తమ ఇంట్లో వాళ్లే తిట్టే పరిస్థితులు తీసుకువచ్చారన్నారు. ఇంట్లో అవ్వ నాలుగు వేల పించన్‌, అక్క 2500మహాలక్ష్మి, బయటకు పోతే రైతులు రైతుబంధు, రైతుబీమా, బోనస్‌ ఏదని అడుగుతుంటే అవమానాలకు గురవుతున్నారని ఆయన అన్నారు. ఈనాడు గ్రామాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలే తిరుగలేని పరిస్థితులు నెలకొనడాన్ని గమనించిన అన్‌సాన్‌పల్లి వాసుల్లో చైతన్యం వచ్చిందని, తూర్పు నుంచే ఉద్యమంలా మొదలైందన్నారు. ఇటీవలనే బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లోకి చేరిన సింగిల్‌ విండో డైరెక్టర్‌ రాజబాబు సైతం తిరిగి బీఆర్‌ఎస్‌లోకి రావడం జరిగిందని, అయితే పాత వాళ్లు కొత్త వాళ్లను కలుపుకుని రావడం శుభసూచికమని, ఇదే స్పూర్తితో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల్లో పాత వాతావరణం రావాలంటే, గ్రామ అభివృధ్ది కనబడాలంటే మన ఊరు పార్టీ, మన రాష్ట్ర పార్టీ బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. ఇంకా మూడేళ్ల సమయం ఉంది మీ అవసరాలు తీర్చుతామని చెప్పినా వినకుండా బీఆర్‌ఎస్‌లోకి రావడం అభినందనీయమని, ఇంకా మూడేళ్లయినా కాంగ్రెస్‌ పార్టీ ఆశలు మాత్రమే చూపిస్తుందన్నారు. మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌ మంత్రి హోదాలో ఉండి కూడా సొంతూరిలో నలుగురికి సాయం చేయలేదని, ఓనలుగురికి ఉద్యోగాలు ఇప్పించలేదన్నారు. 40ఏండ్లు ఒకే కుటుంబానికి అధికారం ఇచ్చినా వాళ్ల బాగు కోసం చూసుకున్నారే తప్ప ఓట్లు వేసి ప్రజల గురించి ఏనాడు ఆలోచన చేయలేదని విషయాన్ని సమాజం గుర్తించాలన్నారు. ధన్వాడ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క ఇందిరమ్మ ఇళ్లు పూర్తి చేయించలేదని, వాళ్లు మాత్రం ఇండ్లు నిర్మించుకుంటారే కానీ పేదోడికి మాత్రం ఇళ్లు అవసరం లేదనే ఆలోచన దుద్దిళ్ల కుటుంబానిదన్నారు. మండలానికో ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఇస్తామని ముఖ్యమంత్రి హమీ ఇచ్చాడని, కానీ గత ప్రభుత్వంలో గొప్పగా నడిచిన గురుకుల నిర్వహణను గాలికి వదిలేశారని, కనీస వసతులు కూడా కల్పించడం లేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలో చేరిన వారే చరిత్రలో నిలిచిపోతారని, ఆనాడు పదేళ్ల అధికారంలో ఉన్నప్పుడు వాడుకుని అధికారం పోయినంక వెళ్లిన వారి పేర్లను పింక్‌ బుక్‌ లో రాసుకున్నామన్నారు. కష్టకాలంలో వచ్చిన వాళ్లు గుర్తుండి పోతారని, అన్‌సాన్‌పల్లి వాసులు చరిత్రలో నిలుస్తారన్నారు. నియోజకవర్గంలో అత్యధిక శాతం ఉన్న బీసీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీల్లో చైతన్యం వచ్చే వరకు వారి ఆకలి తీరే వరకు తన పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు.