అయ్యప్ప మాలలో మందు తాగుతూ అడ్డంగా దొరికిపోయిన అయ్యప్పా స్వామీ.
జనం వాయిస్ దినపత్రిక, అక్టోబర్ 27:
కొంతమంది భక్తులు అయ్యప్ప మాల ధారణ చేయడం మనందరికీ తెలిసిందే. ఎంతో పవిత్రతో, నిష్టతో 41 రోజుల పాటు కఠిన దీక్ష కోసం మాల ధారణచేస్తూ అయ్యప్పపై తమ భక్తిని చాటుకుంటుంటారు. అలాంటి అయ్యప్ప మాల ధరించిన ఓ వ్యక్తి మద్యం తాగుతూ అడ్డంగా తొరికిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. దీంతో సదరు వ్యక్తిపై నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో జరిగిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఈ వీడియోలో అయ్యప్ప మాల ధరించి ఉన్న ఓ వ్యక్తి గదిలో రహస్యంగా బీర్ తాగుతుండగా తోటి స్వాములు పట్టుకున్నారు. ఇదంతా వీడియో తీశారు.గదిలో కూర్చుని బీర్ తాగుతుండగా రూమ్‍లోకి వచ్చిన మిగతా స్వాముల ను చూసి సదరు స్వామి ఒక్కసారిగా కంగారుపడి పోయాడు.తోటి స్వాములను చూడగానే ముఖాన్ని దాచుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు.కానీ అతడిని బయటకు వెళ్లకుండా ఆపేసిన తోటి స్వాములు.. మనిషివా పశువువా? ఇదేం బుద్ధి ఇదేం వ్యవహారం? మద్యానికి దూరంగా ఉండలేకపోతే మాల తీసేయాలి. అంతే తప్ప ఇదా పద్దతి? అంటూ మండిపడ్డారు.