ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య.
జనం వాయిస్,వేల్దుర్తి: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్దుర్తిలో చోటుచేసుకుంది. ఆదివారం వెల్దుర్తి ఎస్ఐ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన నాగరాజు (28) చేసిన అప్పులు తీర్చడం కోసం మరోచోట అప్పుచేసి టాటా ఏసీ కొనుగోలు చేసి కిరాయిలకు తిప్పుతున్నాడు. వ్యవసాయం కూడా చేస్తున్నాడు. ఈ క్రమంలో చేసిన అప్పులు తీర్చలేక అప్పుడప్పుడు ఇంట్లో గొడవలు జరుగుతుండేవని అన్నారు. అప్పులు ఇచ్చినవారు ఇంటికి వస్తూ ఉండడంతో మనస్థాపానికి గురై ఆదివారం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకొన్నాడు....