ఇద్దరు పిల్లల రూల్‌ను ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్..<br>
•ఇద్దరు పిల్లల రూల్‌ను ఎత్తివేసేందుకు ఆర్డినెన్స్.•రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం.. ఆర్డినెన్స్ బిల్లుపై సీతక్క సంతకం.•క్యాబినెట్ ఆమోదం తర్వాత గవర్నర్‌కు. జనం వాయిస్ దినపత్రిక:ఇద్దరికన్నా ఎక్కువ మంది పిల్లలుంటే గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధనను ఎత్తివేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ మేరకు ఆర్డినెన్స్‌కు సంబంధించిన బిల్లు పైన మంగళవారం నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి సంతకం అయిన తర్వాత క్యాబినెట్ ముందుకు రానుంది. ఆర్డినెన్సు బిల్లును క్యాబినెట్ ఆమోదించిన తర్వాత...