ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు ఆపండి.
ఇప్పటికైనా గల్లీలో డ్రామాలు ఆపండి. -కాంగ్రెస్, బీజేపీపై హరీశ్ రావు విమర్శలు. జనం వాయిస్,తెలంగాణ డెస్క్: రాజకీయ లబ్ధి పొందేందుకు కాంగ్రెస్,బీజేపీ ఒకరిని మించి ఇంకొకరు నటిస్తున్నారని మాజీ మంత్రి,బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ధ్వజమెత్తారు.బీజేపీ పార్టీ కేంద్రంలో,కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది.ఈ రెండు పార్టీలు మద్దతు ఇచ్చాక ఇక బీసీ రిజర్వేషన్ల పెంపు ఆపేవారెవరని ప్రశ్నించారు.పార్లమెంట్‍లో రాజ్యాంగ సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి ఈ రెండు పార్టీలు కాలయాపన చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీ బంద్ నేపథ్యంలో...