ఉండవల్లిలో అరటి తోట సందర్శించిన బిల్ గేట్స్.

ఉండవల్లిలో అరటి తోట సందర్శించిన బిల్ గేట్స్.- వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక వినియోగం ప్రదర్శన.- రైతులకు కృత్రిమ మేధ ఆధారిత సలహాలు.జనం వాయిస్, అమరావతి, ఫిబ్రవరి 16: మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యాపారవేత్త బిల్ గేట్స్ సోమవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి ఉండవల్లిలోని అరటి తోటను సందర్శించారు. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తున్న ఆధునిక సాంకేతికతను ముఖ్యమంత్రి వివరించారు. ఉండవల్లికి విచ్చేసిన బిల్ గేట్స్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అరటి తోటలో...