janamvoice.com
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 4:03 pm Digital Edition : JANAM VOICE

ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు పేద ప్రజలకు వరం

ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు-పేద ప్రజలకు వరం..
బీజేపీ జిల్లా ఎంపీటీసీల పోరం మాజీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్.

జనం వాయిస్ దినపత్రిక, పెద్దపల్లి:

రామగిరి మండలంలోని పేద కుటుంబాలకు ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో అభినందనీయమని బీజేపీ జిల్లా ఎంపీటీసీల పోరం మాజీ అధ్యక్షుడు మొలుమూరి శ్రీనివాస్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తోందన్నారు.ఉజ్వల యోజన ద్వారా గ్యాస్ కనెక్షన్ అందించడం వల్ల పేద మహిళలు పొగరహిత వంటకు అలవాటు పడతారు. ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, పర్యావరణం శుభ్రంగా ఉంటుంది. ఇంధనం కోసం అడవులకు వెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. ఇది గ్రామీణ మహిళల జీవితంలో నిజమైన మార్పు తీసుకువచ్చే పథకం అని ఆయన పేర్కొన్నారు.రామగిరి మండలంలోని అర్హులైన పేద కుటుంబాలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమీప గ్యాస్ ఏజెన్సీ లేదా గ్రామ వలంటీర్‌ ద్వారా ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్‌ కోసం వెంటనే అప్లికేషన్‌ సమర్పించుకోవాలని మొలుమూరి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.అలాగే ఈ పథకం గురించి ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ స్థానిక నాయకులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. “ప్రతి పేదింట్లో గ్యాస్ చెల్లాచెదరుగా కాకుండా వెలుగుతో మెరవాలి” అన్న లక్ష్యంతో పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన తిరిగి ప్రజలకు సహాయం చేస్తారని శ్రీనివాస్ తెలిపారు. గ్లాస్ కనెక్షన్ కావాల్సినవారు ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు బుక్ కుటుంబ సభ్యులందరి ఆధార్ కార్డులు మూడు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఓటర్ ఐడి కార్డ్ మీ ఫోన్ నెంబర్ ఇస్తే అర్హులైన వారికి మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.