janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 2:30 pm Digital Edition : JANAM VOICE

క‌రీంన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. బ‌ట్ట‌ల షాపులో చెల‌రేగిన మంట‌లు.

క‌రీంన‌గ‌ర్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. బ‌ట్ట‌ల షాపులో చెల‌రేగిన మంట‌లు.

జనం వాయిస్,కరీంనగర్:

కరీంనగర్ జిల్లా
కేంద్రంలోని టవర్ సర్కిల్ వద్ద బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కపిల డ్రస్సెస్ షోరూమ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. దీంతో క్షణాల్లోనే పక్కనున్న షాపులకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో బట్టల దుకాణంతో పాటు వినాయక ఎంటర్ప్రైజెస్, ఫొటోగ్రఫి షాపు, కెనాన్ ఫొటోగ్రఫి దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రెండు గంటల పాటు శ్రమించాల్సి వచ్చింది. ఈ ప్రమాదం కారణంగా కపిల దుకాణం యాజమాన్యానికి భారీగా ఆస్తి నష్టం సంభవించింది.