కరీంనగర్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం… పూర్తిగా దగ్ధమైన బస్సు.

కరీంనగర్ ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో అగ్నిప్రమాదం... పూర్తిగా దగ్ధమైన బస్సు. కరీంనగర్-హైదరాబాద్ వెళ్తున్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు. జనం వాయిస్, కరీంనగర్, జూన్ 21: కరీంనగర్-2 డిపోకు చెందిన ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా, తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ సమీపంలో అకస్మాత్తుగా సాంకేతిక లోపంతో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును వెంటనే ఆపగా, డ్రైవర్, కండక్టర్లు 37 మంది ప్రయాణికులను సురక్షితంగా కిందికి దించారు.  అనంతరం మంటలు బస్సు మొత్తానికి వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు....