janamvoice.com
Newspaper Banner
Date of Publish : 27 October 2025, 11:52 pm Digital Edition : JANAM VOICE

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..!

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.!

జనం వాయిస్ దినపత్రిక, కరీంనగర్:

కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్ స్టేజ్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది,రోడ్డు దాటుతున్న సమయంలో రెండు బైకులు ఢీకొని వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.ప్రమాద తీవ్రతతో రెండు బైకులు పూర్తిగా ధ్వంసమ య్యాయి.రెండు బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా, మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు బైక్ ల వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానికులు వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వీడియో ఇప్పు డు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో ఈ వీడియో మరోసారి గుర్తు చేసింది.ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.