janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 February 2026, 10:28 am Digital Edition : JANAM VOICE

కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌

  • కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్‌
  • ఐదుగురు మావోయిస్టులు మృతి
  • మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ?
  • జనం వాయిస్, వెబ్ డెస్క్ :
  • రాయ్‌పూర్ : తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది.ఈ ఎదురు కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారని అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం_ _ఉందని వారు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో అగ్రనేతలు హతమైనట్టు భద్రతా దళాలు భావిస్తున్నాయి. అయితే_ _ఉన్నతాధికారులు, మావోయిస్టు పార్టీ ధృవీకరించలేదు. మావోయిస్టు నేత దేవ్‌ జీ ఉన్నారనే సమాచారంతో సుమారు ఐదు వేల మంది భద్రతా దళాలను కర్రెగుట్టలో_ _మోహరించారు._
  • _దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మావోయిస్టులకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మధ్యప్రదేశ్‌ నుంచి కర్రెగుట్టల్లోకి మావోలు ప్రవేశించారంటూ నిఘా సంస్థల నుండి సమాచారం అందింది. ఈ సమాచారం మేరకు భద్రతా బలగాలు కూంబింగ్‌ చేపట్టగా ఎదురుకాల్పులు జరిగాయి. మరోవైపు దేశంలో మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్రం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌ గడువు మరికొన్ని రోజుల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలను వేగవంతం చేసింది. ఇప్పటికే వందలాది మంది మావోయిస్టులు మతిచెందగా.. వేలాది మంది వివిధ రాష్ట్రాల ప్రభుత్వాల ఎదుట లొంగిపోయారు. పలువురు మావోయిస్టులను ప్రభుత్వం ఇప్పటికే అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర కమిటీ సభ్యులు దేహార్‌ మిశ్రా, దేవ్‌జీ, గణపతి సజీవంగా ఉన్నట్టు సమాచారం.. మరోవైపు జాతీయ దర్యాప్తు సంస్థ ( ఎన్‌ఐఎ) కూడా మావోయిస్టుల కీలకనేతల వివరాలపై ధృష్టిసారించింది. తాజా పరిస్థితులను కేంద్ర హోం శాఖకు నివేదిస్తుంది.