కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్

కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్ జనం వాయిస్,తెలంగాణ : నిజామాబాద్‌లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కేసులో నిందితుడు రియాజ్ మృతి చెందాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు ప్రయత్నించి పారిపోతుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. కాగా నిజామాబాద్‌లో వరుస వాహన, గొలుసు చోరీలకు పాల్పడుతున్న నిందితుడు రియాజ్‌ను పట్టుకునేందుకు సీసీఎస్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ వస్తే.. కత్తితో దాడి చేసి అతడిని దారుణంగా హత్య చేశాడు.