కేసీఆర్ ఇక అసెంబ్లీకి రానట్లేనా? వస్తే సీఎంగానే వస్తారా?
కేసీఆర్ ఇక అసెంబ్లీకి రానట్లేనా? వస్తే సీఎంగానే వస్తారా? జనం వాయిస్, డెస్క్, సెప్టెంబర్ 09:ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో అనుచిత భాష వాడుతున్నారని, బూతులు మాట్లాడుతున్నారని, అలాంటి గౌరవం లేని సభకు తాను వెళ్లనని కేసీఆర్ చెప్పిన సంగతి తెలిసిందే. కేసీఆర్ వెళ్లాల్సిన అసెంబ్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. ఎర్రవెల్లిలో కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు.ఎన్టీఆర్, జయలలిత, చంద్రబాబు లాంటి నేతలు సభలో అవమానాలు ఎదుర్కొన్నప్పుడు...