కోటి 15 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త!
జనం వాయిస్,న్యూఢిల్లీ:అక్టోబర్ 29:
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోడీ సర్కారు శుభవార్త చెప్పింది.కోటి పదిహేను లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారు ల జీతాలు, పింఛన్లు పెంచేందుకు వీలుగా 8వ వేతన కమిషన్‌కు కేంద్ర కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన దేశాయ్ ఈ పే కమిషన్‌కు ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించనున్నారు. ప్రస్తుత 7వ వేతన సవరణ సంఘం కాలపరిమితి 2026 తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత కొత్త వేతన సవరణ అమలు చేయడానికి వీలుగా 8 వ పే కమిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై పలువురు కేంద్ర మంత్రులు,మంత్రిత్వ విభాగాల సిబ్బంది తో విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరిపింది. అనంతరం కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో ఛైర్‌పర్సన్, ఇద్దరు సభ్యులు ఉండనున్నారు. ఈ సంఘం 18 నెలల్లో సిఫార్సులు ఇవ్వనుందని కేంద్రం ఓ ప్రకటనలో వెల్లడించింది. దేశంలో సుమారు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు , 65 లక్షల మంది పింఛనుదారుల వేతనాలు, భత్యాలు ఎంత ఉండాలో నిర్ణయించడంలో వేతన సంఘం కీలక పాత్ర పోషించనుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టి లో పెట్టుకుని ప్రస్తుతమున్న జీతాలు, పింఛన్లను ఎంతమేర పెంచాలో ప్రభుత్వానికి సిఫార్సు చేస్తుంది. ఈ నివేదిక ఆధారంగా కేంద్ర ప్రభుత్వం వేతన సవరణ చేపడుతుంది