janamvoice.com
Newspaper Banner
Date of Publish : 17 April 2026, 2:40 am Digital Edition : JANAM VOICE

కోట్ల ఆటగాళ్లు ఫెయిల్..

కోట్ల ఆటగాళ్లు ఫెయిల్..

జనం వాయిస్, న్యూఢిల్లీ, ఏప్రిల్ 16:

ఐపీఎల్ 2026 సీజన్‌లో భారీ మొత్తాలు వెచ్చించి కొనుగోలు చేసిన ఆటగాళ్లు మైదానంలో ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఫ్రాంచైజీలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా భారీ ధరకు కొనసాగించిన ఆటగాళ్లు వరుసగా విఫలమవుతూ విమర్శలకు గురవుతున్నారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ ను సుమారు 21 కోట్ల రూపాయలకు కొనసాగించింది. అయితే ఆయన ప్రదర్శన మాత్రం నిరాశపరుస్తోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన కీలక మ్యాచ్‌లో కేవలం ఒక పరుగుకే ఔటవడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇది ఒక్క మ్యాచ్‌కే పరిమితం కాలేదు. ఈ సీజన్‌లో ఆయన గత ఐదు ఇన్నింగ్స్‌లలో చేసిన పరుగులు 8, 1, 13, 19, 1గా ఉండటం తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ఇంత భారీ మొత్తంతో కొనసాగించిన ఆటగాడు కనీసం ఒక్క అర్థశతకం కూడా చేయకపోవడంతో సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక పూరన్ మాత్రమే కాదు, ఈ సీజన్‌లో భారీ ధర పలికిన పలువురు ఆటగాళ్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. దీనితో జట్ల ఆర్థిక ప్రణాళికలపై ప్రభావం పడుతోంది. ప్లేఆఫ్ దశ సమీపిస్తున్న వేళ కీలక ఆటగాళ్లు ఇలా ఫామ్ కోల్పోవడం జట్ల విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు త్వరగా ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. లేకపోతే జట్లు కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది.