గుండెపోటుతో గిరిజనుడి మృతి..!
మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
జనం వాయిస్, అక్కన్నపేట, జూన్ 16:
హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో అక్కన్నపేట మండలం పంతులు తండాకు చెందిన బానోతు లాలు అనే గిరిజనుడు ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో సోమవారం రాత్రి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు కరీంనగర్ జిల్లాలో వలస కూలీగా జీవనం కొనసాగిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆర్థిక భారం ఎక్కువ కావడంతో పరిస్థితి బాగాలేక అప్పుల బాధ ఎక్కువ కావడంతో కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న పరిస్థితుల్లో హఠాత్తుగా గుండెపోటు వచ్చి మరణించడంతో ఆ కుటుంబం రోడ్డున పడినట్లు అయిందని మృతుని భార్య కన్నీరు మున్నేరుగా విలపించింది. మృతునికి కూతురు ఇద్దరు కుమారులు ఉన్నారు మృతుని కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గిరిజన సంఘ నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.