గోదావరిఖని ఏసీపీ పేరిట ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్.
జనం వాయిస్ దినపత్రిక, గోదావరిఖని:
ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాప్ లు(ఫేస్ బుక్, ఇంస్టాగ్రామ్, వాట్సాప్,) అధిక సంఖ్యలో సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి హ్యాక్ అవుతున్నాయి.ఫేక్ అకౌంట్ ల వల్ల చాలా మంది మోసపోతు తీవ్రంగా నష్టపోతున్నారు.అయితే తాజాగా గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ఫేస్ బుక్ అకౌంట్ ను సైబర్ నేరస్తులు హ్యాక్ చేయడం చర్చనీయాంశమైంది.ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ తో కాల్స్ మెసేజ్ లు పంపిస్తున్నట్లు తెలిసింది.ఈ మేరకు ఏసీపీ రమేష్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.కాగా ఫేస్ బుక్ నుండి తన పేరిట వచ్చే కాల్స్ మెసేజ్ లకు స్పందించవద్దని ఏసీపీ రమేష్ కోరారు.