గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో విషాదం చోటుచేసుకుంది. జనం వాయిస్ దినపత్రిక, గోదావరిఖని : గోదావరిఖని కి చెందిన కాంపెల్లి లింగయ్య అనే సింగరేణి కార్మికుని కుమార్తె సుప్రియ ను ఇటీవల డెలివరీ కోసం సింగరేణి ఆసుపత్రిలో చేర్పించారు. సాధారణ పరీక్షలు చేసిన వైద్యులు నిర్లక్ష్యం చేయడంతో పురిటిలోనే ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సకాలంలో వైద్యులు చికిత్స అందించకపోవడంతోనే డెలివరీ కాకముందే ఆడ శిశువు మరణించిందని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగి బోరున విలపించారు....