janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 8:12 pm Digital Edition : JANAM VOICE

గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలి -జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.<br>

గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలి- జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
*అనుమతి లేకుండా ఇంటి నిర్మాణాలు చేపట్టిన వారి పై కఠిన చర్యలు.
*నవంబర్ 1 నుంచి నవంబర్ 7 వరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్.
*పంచాయతీ శాఖ పని తీరు పై  సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్.

జనం వాయిస్ దినపత్రిక,పెద్దపల్లి,అక్టోబర్-29:

గ్రామాలను పరిశుభ్రంగా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పంచాయతీ శాఖ పని తీరు పై  సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, గ్రామాల్లో  అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు  చేయరాదని. అక్రమ నిర్మాణాల చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని, నవంబర్ 1నుంచి నవంబర్ 7 వరకు పెద్దపల్లి జిల్లాలోని ప్రతి గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని , గ్రామాలలో ప్లాస్టిక్ ఎక్కడ ఉండడానికి వీలు లేదని, చిన్న కవర్ కూడా ఉండవద్దని, ఆ రితీలో పారిశుధ్య పనులు చేయాలని కలెక్టర్ సూచించారు

.గ్రామీణ ప్రాంతాలలో ఖాళీ స్థలాలు ఎక్కడ చెత్త ఉండకుండా చూసుకోవాలని, ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరణకు నిర్దిష్ట షెడ్యూలు ఫాలో కావాలని, ప్రజలు ఎవరు బయట చెత్త వేయడానికి వీలు లేదని అన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.గ్రామాలలో ఉన్న పిచ్చి మొక్కలను, పోదలను పూర్తి స్థాయిలో తొలగించాలని , కాల్వల పక్కన ఉన్న చెత్త శుభ్రం చేయాలని, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రులు, పంచాయతీ భవనం, ప్రభుత్వ కార్యాలయాల పరిధిలో పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని, గ్రామాలలో అందుబాటులో ఉన్న ట్రాక్టర్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.గ్రామాలలో స్పష్టమైన మార్పు కనిపించేలాగా పారిశుధ్య నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలలో పన్ను వసూలు చాలా తక్కువగా  ఉందని , నవంబర్ 7 నాటికి కనీసం నిర్దేశించుకున్న లక్ష్యంలో 60% పన్ను వసూలు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా సేకరించడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. గ్రామాలలో త్రాగునీటి సరఫరా వ్యవస్థను చెక్ చేసుకోవాలని ఎక్కడైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడితే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటికి శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేయాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో  జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య , ఎంపిఓ లు, సంబంధిత  అధికారులు, తదితరులు పాల్గోన్నారు.