janamvoice.com
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 6:33 pm Digital Edition : JANAM VOICE

చదువుతో పాటు యువత క్రీడలలోనూ ప్రతిభ చూపాలి.

•చదువుతో పాటు యువత క్రీడలలోనూ ప్రతిభ చూపాలి..

•కాటారంలో విజేతలకు బహుమతుల అందజేతలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు.

జనం వాయిస్,మంథని: యువతే దేశ భవిష్యత్తు అని, చదువుతో పాటు యువత క్రీడలలోనూ ప్రతిభ చూపాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీనుబాబు అన్నారు. ఆదివారం మంథని నియోజకవర్గంలోని కాటారం మండలం ధన్వాడ గ్రామంలో నిర్వహించిన డీపీఎల్-10 క్రికెట్ టోర్నమెంట్‌లో విజయం సాధించిన విన్నర్, జీసీఏ టీంకు, రన్నర్ అప్ హరీష్-11 టీం జట్లకు శ్రీను బాబు బహుమతులు అందజేశారు. అనంతరం క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, పట్టుదల, జట్టు స్పూర్తి వంటి విలువలను పెంపొందిస్తాయని తెలిపారు.యువత దేశ భవిష్యత్తు అని, వారు చదువుతో పాటు క్రీడలలోనూ ప్రతిభ చూపి సమాజ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు, క్రీడా మైదానంలో చూపించే కృషి, క్రమశిక్షణ జీవితంలో కూడా విజయానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా యువత సామాజిక సేవ, ప్రజాసేవ రంగాల్లో ముందుకు రావాలని, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ యువతకు ప్రోత్సాహంగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.