జగతిని జాగృతం చేసే దివ్య దీప్తుల దీపావళి.
జగతిని జాగృతం చేసే దివ్య దీప్తుల దీపావళి.-తెలంగాణ వ్యాప్తంగా నేడే దీపావళి వేడుకలు.-కళాకళలాడుతున్న పల్లెలు పట్టణాలు.జనం వాయిస్ దినపత్రిక:భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు. వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దివ్య దీప్తుల దీపావళి. జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీసమేతంగా...