janamvoice.com
Newspaper Banner
Date of Publish : 28 October 2025, 2:37 pm Digital Edition : JANAM VOICE

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎంపిడిఓ లు.

జిల్లా కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎంపిడిఓ లు.

జనం వాయిస్,పెద్దపల్లి,అక్టోబర్-28:

గ్రూప్ -1 నియామకాల లో భాగంగా పెద్దపెల్లి జిల్లాకు కేటాయించిన ముగ్గురు ఎంపిడిఓలు   మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ను మర్యాద పూర్వకంగా కలిశారు.

గ్రూప్ 1 ఫలితాలలో 509 ర్యాంకు సాధించిన కరీంనగర్ కు చెందిన కంకణాల శ్రీజా రెడ్డి, 609 ర్యాంకు సాధించిన జగిత్యాలకు చెందిన వేముల సుమ లత, 446 ర్యాంకు సాధించిన  కరీంనగర్ జిల్లాకు చెందిన సాదినేని ప్రియాంక లను పెద్దపెల్లి జిల్లా కేడర్ కు కేటాయించడం జరిగింది.కంకణాల శ్రీజ రెడ్డి ను మంథని ఎంపీడీవో గా,వేముల సుమలత ను అంతర్గాం ఎంపీడీవో గా,సాదినేని ప్రియాంక ను కమాన్ పూర్ ఎంపిడిఓ గా కలెక్టర్ కేటాయించారు.ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

పుష్ప గుచ్చం ఇస్తున్న నూతన ఎంపిడిఓ