జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రచారం.
జనం వాయిస్ దినపత్రిక,రామగుండం:

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, మార్పు కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు తమ ఆశీర్వాదం అందించి,విజయాన్ని అందజేయాలని ఆకాంక్షించారు.ఈ ప్రచార కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామణ రావు,మేడిపల్లి సత్యం,ఎంపీ చామల కిరణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
