తిరుపతి రైల్వే స్టేషన్‌కు ప్రపంచ స్థాయి సౌకర్యాలు.
తిరుపతి రైల్వే స్టేషన్‌కు ప్రపంచ స్థాయి సౌకర్యాలు.- ప్రయాణికులకు మెరుగైన అనుభవం – ఆధునికీకరణ పనులు వేగంగా. - అమృత్ స్టేషన్ పథకంతో రూపాంతరం.జనం వాయిస్, తిరుపతి, మార్చి 29: తిరుపతి రైల్వే స్టేషన్‌ను ప్రపంచ స్థాయి ప్రయాణానికి అనుగుణంగా తీర్చిదిద్దే పనులు వేగంగా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న అమృత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్‌ను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నారు. రోజూ లక్షలాది మంది భక్తులు, ప్రయాణికులు రాకపోకలు చేసే ఈ స్టేషన్‌లో సదుపాయాల పెంపు ప్రధాన లక్ష్యంగా అధికారులు...