janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 10:33 am Digital Edition : JANAM VOICE

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.

26 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులు.

టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 15 గంటల సమయం.

జనం వాయిస్ దినపత్రిక :

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 26 కంపార్టు మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 76,343 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 18,768 మంది భక్తులు తల నీలాలు సమర్పించారు. తిరుమలలో మంగళవారం నాడు రూ. 4.34 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు, అంగ ప్రదక్షిణ టోకెన్లకు సంబంధించి లక్కీ డిప్ లో టికెట్లు పొందిన వారు రేపు మధ్యాహ్నం 12 గంటలకు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది.