తెలంగాణలో దంచి కొడుతున్న వానలు..!
విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన జిల్లా అధికారులు.
జనం వాయిస్ దినపత్రిక, తెలంగాణ:
ఏపీ ని వణికిస్తున్న మొంథా తుఫాను తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతోంది.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత అర్థరాత్రి నుంచి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.దీంతో రేపు పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. ములుగు, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, యాదాద్రి భువనగిరి, సిద్ధిపేట జిల్లాలోని స్కూళ్లకు సెలవు ప్రకటించారు.మరోవైపు కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ లలో కూడా కుండపోత వాన పడుతుండటంతో ఆయా జిల్లాల్లో కూడా సెలవు ప్రకటించాలని స్టూడెంట్స్, పేరెంట్స్ కోరుతున్నారు. ఇక రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని అనేక ప్రాంతా ల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.