janamvoice.com
Newspaper Banner
Date of Publish : 20 October 2025, 1:29 am Digital Edition : JANAM VOICE

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు.

తెలంగాణ ప్రజలకు కేసీఆర్ దీపావళి శుభాకాంక్షలు..

జనం వాయిస్, తెలంగాణ:

ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో విజయాల కాంతులు నింపాలని ఆకాంక్షించారు. అందరి జీవితాల్లో చీకట్లు తొలగి ఆనందపు వెలుగు నిండాలని కోరారు. దీపావళి సందర్భంగా ప్రతీ గడపలో ఆనందం వెల్లివిరియాలని అభిలషించారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటూ ఇంటిల్లిపాది సందడిగా, సంబురంగా సెలబ్రేట్ చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, చీకటిని పారదోలుతూ చెడు మీద గెలిచిన మంచిని గుర్తు చేసుకుంటూ దీపావళి (Diwali) పండుగను జరుపుకుంటాం. చిన్న పెద్దా తేడా లేకుండా కొత్తబట్టలు, పిండి వంటలు, కాంతులు విరజిమ్మే టపాసులు, అందమైన దీపాలతో వెలిగిపోయే ఇళ్లతో యావత్ భారతదేశం సంబరాల్లో మునిగిపోతుంది. ఈ పండుగ వేళ దీపాల కాంతుల నడుమ దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజించడం ప్రధాన ఆచారం.