janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 5:03 pm Digital Edition : JANAM VOICE

తెలంగాణ రైసింగ్ విజన్ 2047 సర్వే నందు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.

తెలంగాణ రైసింగ్ విజన్ 2047 సర్వే నందు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.
-పెద్దపల్లి జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష.
-అక్టోబర్ 25 లోపు ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేయాలి.
-తెలంగాణ రైసింగ్ 2047 సర్వే పై పత్రిక ప్రకటన విడుదల చేసిన జిల్లా కలెక్టర్.

జనం వాయిస్,పెద్దపల్లి:

తెలంగాణ రైసింగ్ విజన్ 2047 సర్వే నందు ప్రతి ఒక పౌరుడు పాల్గోన్ని తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు.దేశానికి స్వాతంత్రం లభించి 100 సంవత్సరాలు పూర్తయ్యే సమయానికి తెలంగాణ రాష్ట్రాన్ని మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ రైసింగ్ 2047 విజన్  డాక్యుమెంట్  తయారు చేస్తుందని కలెక్టర్ తెలిపారు.2047 నాటికి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా చూడాలనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలను తెలంగాణ రైసింగ్ 2047 సర్వే నందు తెలియజేయాలని అన్నారు. ఈ సర్వేలో ఇప్పటివరకు తెలంగాణ ప్రాంతం నుంచి మూడు లక్షల మంది పాల్గొని తమ అభిప్రాయాలు తెలిపారని, అక్టోబర్ 25 తో సర్వే గడువు ముగుస్తుందని కలెక్టర్ తెలిపారు.అక్టోబర్ 25 లోపు జిల్లాలోని అన్ని వర్గాలకు చెందిన మేధావులు, సామాన్య ప్రజలు, రైతులు, కార్మికులు విద్యార్థులు, యువత ప్రతి ఒక్కరు తెలంగాణ రైసింగ్ 2047 రీసెంట్ డాక్యుమెంట్ సంబంధించి తమ అభిప్రాయాలను https://www.telangana.gov.in/telanganarising/
లింక్ నందు సర్వేలో పాల్గొని తెలియజేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.