దీపావళి పర్వదినాన ఘనంగా వేడుకలు నిర్వహించిన పెద్దపల్లి శాసనసభ్యుడు చింతకుంట విజయరమణ రావు.
జనం వాయిస్, పెద్దపల్లి:
మంగళవారం రాత్రి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తమ ఇంటి వద్ద కుటుంబ సభ్యులతో మరియు కాంగ్రెస్ కుటుంబ సభ్యులతో కలిసి కాకరపువ్వొత్తులు, టపాసులు కాల్చి దీపావళి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ రోజున ప్రతి ఒక్కరూ సురక్షితంగా టపాసులు కాల్చాలని ప్రజలకు సూచించారు.
