janamvoice.com
Newspaper Banner
Date of Publish : 22 October 2025, 8:41 am Digital Edition : JANAM VOICE

నేటి రాశి ఫలాలు<br> 22.10.2025*

నేటి రాశి ఫలాలు
22.10.2025

🐐 *_మేషం_*
22-10-2025)

మీ కృషి ఫలప్రదం అవుతుంది. ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. మానసిక ప్రశాంతతతో పనులు సజావుగా సాగుతాయి. మీ ప్రతిభకు గుర్తింపు, ప్రశంసలు లభిస్తాయి. ఈశ్వర దర్శనం ఆత్మశాంతితో శుభఫలితాలను ప్రసాదిస్తుంది.
🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 *_వృషభం_*
22-10-2025)

కాలం శుభప్రదంగా ఉంది. ఆత్మవిశ్వాసంతో ధైర్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార రంగాల్లో సానుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. సృజనాత్మక ఆలోచనలు మంచి ఫలితాలను అందిస్తాయి. మనసు సంతోషంగా ఉంటుంది. ఇష్టదైవ స్మరణ శ్రేయస్సును కలిగిస్తుంది.
🐂🐂🐂🐂🐂🐂🐂

💑 *_మిధునం_*
22-10-2025)

మీ తెలివితేటలు అందరి దృష్టినీ ఆకర్షిస్తాయి. స్నేహితులతో ఆనందభరిత క్షణాలు గడుస్తాయి. కొత్త ప్రణాళికలు భవిష్యత్తు విజయాలకు పునాది వేస్తాయి. నిశ్చయాత్మక దృక్పథం అవసరం. గురు ధ్యానం అదృష్టాన్ని బలోపేతం చేస్తుంది.
💑💑💑💑💑💑💑

🦀 *_కర్కాటకం_*
22-10-2025)

ఆర్థిక సంబంధ విషయాల్లో వివేకంతో వ్యవహరించాలి. అనవసర ఖర్చులను తగ్గించండి. కుటుంబ విషయాల్లో సహనం, దూరదృష్టి అవసరం. మీ సహజ దయా గుణం శాంతి వాతావరణాన్ని తెస్తుంది. దుర్గానామస్మరణ సానుకూల శక్తిని నింపుతుంది.
🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 *_సింహం_*
22-10-2025)

సహచరుల నుంచి సహకారం లభిస్తుంది. ఆర్థికంగా లాభదాయకమైన అవకాశాలు ఎదురవుతాయి. సాహసంతో ముందుకెళితే విజయం మీదే. చిన్న సమస్యలు పట్టుదలతో పరిష్కరిస్తారు. ఇష్టదైవ ధ్యానం మనోబలాన్ని పెంచుతుంది.
🦁🦁🦁🦁🦁🦁

💃 *_కన్య_*
22-10-2025)

ఉద్యోగ రంగంలో సంతోషకర వార్తలు వింటారు. కుటుంబంలో సఖ్యత, సంతోషం నెలకొంటాయి. ఖర్చులు నియంత్రణ అవసరం. మానసిక ఉల్లాసం కోసం విశ్రాంతి తీసుకోండి. శ్రీలక్ష్మీ ధ్యానం ధనసౌభాగ్యాన్ని పెంచుతుంది.
💃💃💃💃💃💃💃

*⚖ _తుల_*
22-10-2025)

మీ ప్రయత్నాలకు ప్రతిఫలం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. వినోద కార్యక్రమాలతో ఆనందంగా సాగుతుంది. సృజనాత్మక ఆలోచనలు కొత్త అవకాశాలను తీసుకువస్తాయి. ఇష్టదైవ భక్తి శుభప్రదం.
⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 *_వృశ్చికం_*
22-10-2025)

పట్టుదలతో ముందుకెళితే ఆటంకాలు వాటంతటవే తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. ఒక ముఖ్యమైన నిర్ణయం మిమ్మల్ని కొత్త దిశలో నడిపిస్తుంది. దుర్గా ధ్యానం శక్తితో పాటు విజయాన్ని ప్రసాదిస్తుంది.
🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 *_ధనుస్సు_*
22-10-2025)

శుభసమాచారాలు మీ జీవితంలో ఉత్సాహాన్ని నింపుతాయి. కుటుంబ సభ్యుల సహకారం ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వ్యక్తిగత సంబంధాల్లో అనుకూల పరిణామాలు చోటుచేసుకుంటాయి. శివ ధ్యానం మానసిక బలంతో పాటు సౌభాగ్యాన్ని అందిస్తుంది.
🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 *_మకరం_*
22-10-2025)

పనుల్లో స్థిరత్వం సాధిస్తారు. వ్యాపార నిర్ణయాల్లో ముందుచూపు అవసరం. కృషి ఫలిస్తుంది, గుర్తింపు లభిస్తుంది. కుటుంబంలో శుభవార్తలు, ఆనంద క్షణాలు ఉంటాయి. శ్రీవేంకటేశ్వర దర్శనం మీ విజయమార్గాన్ని బలపరుస్తుంది.
🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 *_కుంభం_*
22-10-2025)

ఆర్థిక సంబంధ విషయాల్లో జాగ్రత్త అవసరం. పట్టుదల, ఓర్పుతో ముందుకు సాగితే శ్రేయస్కర ఫలితాలు వస్తాయి. ఆరోగ్య సంరక్షణపై శ్రద్ద చూపండి. శ్రీలక్ష్మీ ఆరాధన మానసిక శక్తితో పాటు శాంతిని ఇస్తుంది.
🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 *_మీనం_*
22-10-2025)

సౌభాగ్యం, సంపద పెరుగుతాయి. ఒక ముఖ్యమైన పని విజయవంతం అమవుతుంది. సమయానికి మద్దతు లభిస్తుంది. కొత్త వస్తువుల కొనుగోలు ఆనందాన్ని తెస్తుంది. హనుమాన్ చాలీసాచదవడం మంగళప్రదం.
🦈🦈🦈🦈🦈🦈🦈