janamvoice.com
Newspaper Banner
Date of Publish : 15 June 2026, 2:05 pm Digital Edition : JANAM VOICE

పాఠశాల ప్రారంభమైన తొలి రోజే గేటుకు తాళం వేసిన కాంట్రాక్టర్.

పాఠశాల ప్రారంభమైన తొలి రోజే గేటుకు తాళం వేసిన కాంట్రాక్టర్.

పెరుమండ్ల సంకీస ఎంపీపీఎస్ పాఠశాలకు  తాళం వేసి నిరసన వ్యక్తం చేసిన కాంట్రాక్టర్ రామనాధం.

జనం వాయిస్ -మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి :

పాఠశాల ప్రారంభమైన తొలిరోజే మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్ మండలం, పెరుమండ్ల సంకిస గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలకు కాంట్రాక్టర్ రామనాథం తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ,మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.40 లక్షల వ్యయంతో పాఠశాల అభివృద్ధి పనులు, కొత్త తరగతి గదుల నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు.మొత్తం బిల్లులో ఇప్పటివరకు కేవలం రూ.7 లక్షలు మాత్రమే అందాయని, ఇంకా రూ.33 లక్షలు బకాయిగా ఉన్నాయని కాంట్రాక్టర్ ఆరోపించారు.బిల్లుల విడుదల కోసం పలుమార్లు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆందోళనకు దిగినట్లు పేర్కొన్నారు.పనుల కోసం అప్పులు చేసి నిర్మాణం చేపట్టామని, ప్రస్తుతం వడ్డీల భారం పెరిగి అప్పు ఇచ్చినవారి ఒత్తిళ్లు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.తనకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు పాఠశాల గేటుకు వేసిన తాళం తీయబోనని కాంట్రాక్టర్ రామనాథం స్పష్టం చేశారు.