పోచమ్మ వాడలో డ్రైనేజీలో చెత్త తీయక ప్రజలకు ఇబ్బందులు.
–రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పిల్లి సత్యనారాయణ.
జనం వాయిస్ దినపత్రిక, మంథని:
మంథని పట్టణంలోని పోచమ్మవాడలో కాలువల లోని చెత్తాచెదారం తీయడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పిల్లి సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని మున్సిపాలిటీ అధికారులు పోచమ్మ వాడలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టకున్నప్పటికీ తాను 20 మీటర్ల మేర డ్రైనేజీని నిర్మించానని ఆయన పేర్కొన్నారు. అధికారులు డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోయినా సరే కానీ డ్రైనేజీలోని చెత్త చెదారం తీయకపోవడం బాధాకరమన్నారు. ప్రజలకు ఉపయోగ పడే డ్రైనేజీ తన స్వంత ఖర్చులతో కట్టించినప్పటికీ మున్సిపాలిటీ ఇబ్బంది డ్రైనేజీ లోని చెత్తాచెదారం ఎందుకు తీయడం లేదో వార్డు ప్రజలకు తెలపాలన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు నీరు నిలిచిపోయి చెత్తాచెదారం కుళ్లిపోయి ఇప్పటికే ప్రజలకు విషజ్వరాలు ప్రబలుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు పలుమార్లు చెప్పినప్పటికీ డ్రైనేజీలోని చెత్తచెదారం తీయకపోవడంతో తానే డ్రైనేజీలోని చెత్తాచెదారం తీసేశానన్నారు. అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయిన ఈ సమస్యను తీర్చడం లేదని దీంతో ప్రజలు అనారోగ్యానికి గురై రోగాల బారిన పడుతున్నారని ఆయన అన్నారు. ఇప్పటికే వర్షాలు పడుతుండడంతో ప్రజలు సీజనల్ వ్యాధులతో బాధపడుతూ గోదావరిఖని, కరీంనగర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించి పోచమ్మ వాడలోని డ్రైనేజీలలో పూర్తిస్థాయిలో చెత్తాచెదారం తీసివేయాలని ఆయన కోరారు.