పోచమ్మ వాడలో డ్రైనేజీలో చెత్త తీయక ప్రజలకు ఇబ్బందులు.
పోచమ్మ వాడలో డ్రైనేజీలో చెత్త తీయక ప్రజలకు ఇబ్బందులు. -రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు పిల్లి సత్యనారాయణ. జనం వాయిస్ దినపత్రిక, మంథని: మంథని పట్టణంలోని పోచమ్మవాడలో కాలువల లోని చెత్తాచెదారం తీయడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పిల్లి సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంథని మున్సిపాలిటీ అధికారులు పోచమ్మ వాడలో డ్రైనేజీ నిర్మాణం చేపట్టకున్నప్పటికీ తాను 20 మీటర్ల మేర డ్రైనేజీని నిర్మించానని ఆయన పేర్కొన్నారు. అధికారులు డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోయినా సరే కానీ డ్రైనేజీలోని చెత్త చెదారం తీయకపోవడం బాధాకరమన్నారు. ...