బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకుడు.
జనం వాయిస్,ముత్తారం,పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు సట్ల మొగిలి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.శనివారం సాయంత్రం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో భీఆర్ఎస్ పార్టీ లో చేరారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ మొగిలి కి బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.