-బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు.-ఉద్యమానికి బీఆర్ఎస్ నైతిక మద్దతు: కేటీఆర్ స్పష్టం.
-బీసీ బంద్ పై కాంగ్రెస్ కపట ప్రేమ.
- -బండి సంజయ్ ఎక్కడున్నారు కేటీఆర్ ఆగ్రహం.
జనం వాయిస్,డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ-ఐకాస్ ఆధ్వర్యంలో ఈ నెల 18న చేపట్టిన రాష్ట్రవ్యాప్త బంద్‌కు (బంద్ ఫర్ జస్టిస్) భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నైతిక మద్దతు ప్రకటించింది.ఈ సందర్భంగా బీసీ జేఏసీ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో పాటు కమిటీ ప్రతినిధులు మంగళవారం తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి బంద్‌కు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. బంద్‌కు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని వారు కోరారు. బీఆర్ఎస్ పార్టీ బీసీల ఉద్యమానికి మద్దతునివ్వడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.బీసీ ప్రతినిధులతో మాట్లాడిన కేటీఆర్, బీసీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ తమ హయాంలో ఎన్నో చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.బీసీలకు నిజమైన ప్రయోజనాలు చేకూరాలంటే పార్లమెంటులో బిల్లును ఆమోదించాలని, అంతేకానీ “అసెంబ్లీలో చేసి ఇతరులపై నెపం నెట్టడం సమంజసం కాద”ని ఆయన పరోక్షంగా అధికార కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.బీసీల విషయంలో కాంగ్రెస్ పార్టీది చిత్తశుద్ధి లేని శివపూజ అని ఎద్దేవా చేశారు.రాజకీయ రిజర్వేషన్లు మాత్రమే సరిపోతాయా,అన్ని రంగాల్లో బీసీలకు మేలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.