బీసీ బంద్‌లో కవిత కుమారుడు ఆదిత్య.
-పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన కవిత.
జనం వాయిస్, డెస్క్:
తెలంగాణ బీసీ బంద్ నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధినేత కవిత తో కలిసి ఆమె కుమారుడు ఆదిత్య ధర్నాలో పాల్గొన్నారు. ‘బీసీలకు 42% రిజర్వేషన్లు తప్పనిసరి, ప్రతి ఇంటి నుంచి యువత ముందుకు రావాలి’ అంటూ ధర్నాలో దేవనపల్లి ఆదిత్య పిలుపు నిచ్చారు.బీసీ రిజర్వేషన్లు స్థానిక ఎన్నికలకు అవసరం అని చెప్పుకొచ్చారు. కాగా, కవిత కుమారుడు మొదటిసారి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది.సోషల్ మీడియా వేదికగా ఆదిత్య ధర్నా వీడియోలు వైరల్‌గా మారాయి.కుమారుడి పొలిటికల్ ఎంట్రీకి కవిత రంగం సిద్ధం చేసినట్లు నెటిజన్లు, రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఇక, విదేశాల్లో చదువుకున్న ఆదిత్య ఇటీవలే ఇండియాకు వచ్చాడు.కుమారుడి పొలిటికల్ ఎంట్రీపై జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు.శనివారం జూబ్లీహిల్స్‌లోని జాగృత కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘నా కొడుకు వయసు చిన్నది.. ఇప్పుడే రాజకీయాలు ఏమీ లేవు. సామాజిక బాధ్యత నేర్పే క్రమంలోనే ఇవ్వాళ్టి బీసీ బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చా.. బీసీల కోసం పోరాటం చేస్తున్నామంటే తాను వస్తానని చెప్పాడు. మన ఇంటి నుంచే సామాజిక బాధ్యత నేర్పాలనే ఉద్దేశంతోనే బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చా’ అని కవిత క్లారిటీ ఇచ్చారు.