భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం.

భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం. జనం వాయిస్ దినపత్రిక: ఆపద మొక్కులవాడు శ్రీ వేంకటేశ్వరుడి దివ్య సన్నిధి తిరుమల (Tirumala)లో భక్తులు కిక్కిరిపోయారు. మరోవైపు కార్తీక మాసం కావడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతోంది. శనివారం స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్లు లేని భక్తుల దర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. ఇక రూ.300 ప్రత్యేక దర్శనానికి (Special Darshan) టోకెన్ తీసుకున్న వారికి కేవలం 3 గంటల్లో...