janamvoice.com
Newspaper Banner
Date of Publish : 10 July 2026, 1:54 am Digital Edition : JANAM VOICE

భారత్‌కు డబ్ల్యూటీసీలో ఐదో స్థానం..

భారత్‌కు డబ్ల్యూటీసీలో ఐదో స్థానం..

జనం వాయిస్, జూలై 10, స్పోర్ట్స్ న్యూస్:

వెస్టిండీస్- శ్రీలంక టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం 2025–27 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తాజా పాయింట్ల పట్టిక విడుదలైంది. ఈ పట్టికలో 87.50 శాతం పాయింట్లతో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, దక్షిణాఫ్రికా రెండో, న్యూజిలాండ్ మూడో స్థానాల్లో నిలిచాయి.
58.33 శాతం పాయింట్లతో బంగ్లాదేశ్ నాలుగో స్థానాన్ని దక్కించుకోగా, భారత్ 48.15 శాతం పాయింట్లతో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు తొమ్మిది టెస్టులు ఆడిన భారత జట్టు నాలుగు విజయాలు, నాలుగు పరాజయాలు, ఒక డ్రాతో మొత్తం 52 పాయింట్లు సాధించింది.
తాజా పట్టికలో శ్రీలంక ఆరో స్థానంలో ఉండగా, ఇంగ్లాండ్ ఏడో, వెస్టిండీస్ ఎనిమిదో, పాకిస్థాన్ తొమ్మిదో స్థానాల్లో ఉన్నాయి. ఓవర్‌రేట్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఇంగ్లాండ్, పాకిస్థాన్ జట్లకు పాయింట్ల కోత విధించబడింది.
డబ్ల్యూటీసీ ఫైనల్‌ రేసులో నిలవాలంటే భారత్ మిగిలిన టెస్టు సిరీస్‌ల్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంది. రాబోయే మ్యాచ్‌ల ఫలితాలే భారత జట్టు ఫైనల్ అవకాశాలను నిర్ణయించనున్నాయి.