Date of Publish : 24 February 2026, 9:40 amDigital Edition : JANAM VOICE
భార్య పక్కనే తన విగ్రహం పెట్టుకున్న ముఖ్య నాయక్.
భార్య పక్కనే తన విగ్రహం పెట్టుకున్న ముఖ్య నాయక్.
జనం వాయిస్, జనగామ జిల్లా:
భాగస్వామి చనిపోతే విగ్రహం ఏర్పాటు చేయడం అక్కడక్కడా చూస్తుంటాం. భార్య మరణాన్ని తట్టుకోలేక విగ్రహం ఏర్పాటు చేసిన ఓ భర్త.. ఆమె పక్కనే నేనుండాలి అంటూ తన విగ్రహం పెట్టుకున్నాడు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం చిప్పరాళ్లబండ తండాకు చెందిన భూక్య నానునాయక్. ఆయనకు దస్లీతో వివాహమై అరవై ఏళ్లు అయ్యింది. ఆమె ఏడాదిన్నర క్రితం కన్నుమూసింది. భార్య భౌతికంగా లేకపోయినా.. జ్ఞాపకమై నిలవాలని తన వ్యవసాయ భూమిలో దస్లీ విగ్రహాన్ని పెట్టాడు నానూ నాయక్. ఏనాటికైనా ఆమె ధరిచేరతానని.. బతుకులోనూ, మరణంలోనూ, చివరికి విగ్రాహాల్లోనూ ఆమెకు తోడుగా ఉండాలని భావించాడు. బతికుండగానే తన విగ్రహాన్ని తయారు చేయించి దస్లీ విగ్రహం పక్కన ముసుగేసి ఉంచాడు. తన మరణానంతరం విగ్రహాన్ని ఆవిష్కరించాలని సంతానాన్ని కోరాడు.