janamvoice.com
Newspaper Banner
Date of Publish : 29 October 2025, 6:49 pm Digital Edition : JANAM VOICE

భూ సమస్యల పరిష్కారానికి పట్టిష్ట చర్యలు.-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.

భూ సమస్యల పరిష్కారానికి పట్టిష్ట చర్యలు.-జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష.
-రెవెన్యూ శాఖ పని తీరు పై సంబంధిత అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్.

జనం వాయిస్ దినపత్రిక,పెద్దపల్లి, అక్టోబర్-29:

భూ సమస్యల పరిష్కారానికి పట్టిష్ట చర్యలు తీసుకోవాలని *జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష* అన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ లో రెవెన్యూ శాఖ పని తీరు పై అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు.భూ భారతి దరఖాస్తులు, సాధా బైనామా, మీ సేవా దరఖాస్తులు, ఎస్.ఐ.ఆర్ ఓటర్ జాబితా, అసైన్మెంట్ భూముల సమస్యలు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ భూ భారతి పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

సాధా బైనామా దరఖాస్తులను పరిశీలించి నిబంధనలు ప్రకారం అర్హత ఉన్నవాటికి పట్టా అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని అన్నారు.22ఏ రిజిస్టర్ సంబంధించి ప్రతి మండలంలో ప్రభుత్వ ఆస్తులు, దేవాదాయ భూముల, ఇతర రిజిస్ట్రేషన్ చేయకూడని భూముల జాబితా సిద్ధం చేయాలని అన్నారు. మీ -సేవా ద్వారా వివిధ అవసరాల కోసం ప్రజలు దరఖాస్తు చేసుకున్న సర్టిఫికెట్లు నిర్ణిత సమయం లోగా వారికి అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎస్.ఐ.ఆర్ సంబంధించిన డెస్క్ పని శనివారం నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.అనంతరం రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి జిల్లాలో చేపట్టిన పలు రోడ్డు అభివృద్ధి పనుల పెండింగ్ భూ సేకరణ*  పై చర్చించారు. పెద్దపల్లి బైపాస్ రోడ్డు భూ సర్వే పనులు సకాలంలో పూర్తి కావాలని కలెక్టర్ తెలిపారు. కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి పెండింగ్ భూసేకరణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.  రామగుండం మారేడు పాక ఆర్ అండ్ ఆర్ కాలనీ పనులు పూర్తి చేయాలని అన్నారు.ఈ సమావేశంలో రెవిన్యూ డివిజన్ అధికారులు
బి గంగయ్య , సురేష్ తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.