janamvoice.com
Newspaper Banner
Date of Publish : 21 October 2025, 3:25 pm Digital Edition : JANAM VOICE

మంథనిలో వైభవంగా దీపావళి వేడుకలు.

మంథనిలో వైభవంగా దీపావళి వేడుకలు.
భక్తిశ్రద్ధలతో ధనలక్ష్మి పూజ, కేదారేశ్వర నోము.

జనం వాయిస్ దినపత్రిక, మంథని:

మంథని ప్రాంత ప్రజలంతా సోమ, మంగళవారాల్లో దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పలు ఆలయాల్లో, ఇండ్ల ల్లో,  షాపింగ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీమహాలక్ష్మి ఆలయంలో వేద పండితులు మారుపాక ప్రశాంత్ శర్మ ఆధ్వర్యంలో శ్రీధనలక్ష్మి పూజను వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం రాత్రి ఇళ్లలో శ్రీ కేదారేశ్వర స్వామి నోమును వైభవంగా నోచుకున్నారు. రాత్రివేళ తమ ఇంట్లో ముందు, షాప్ ల వద్ద బాణాసంచా పేల్చి అందజేశారు.