మా మంత్రులందరిదీ ఒకటే జెండా..ఒకటే అజెండా.
-రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. జనం వాయిస్,తెలంగాణ బ్యూరో: ‘దండుపాళ్యం’ పాలన అంటే ఎవరిదో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.అందుకే గట్టిగా కర్రు కాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారు.అధికారం లేదన్న అసహనం,నిరాశలో కేబినేట్ పై ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను ఆయన శనివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.మంత్రుల మధ్య కుమ్ములాటలు,కేబినేట్ సమావేశంలో వర్గాలుగా విడిపోయి గొడవలు పడ్డారంటూ కట్టుకథల్ని సృష్టించి ప్రజలను...