ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొస్తే సహించను.
-సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు -కొందరి పనితీరులో ఇంకా మార్పు రాలేదు -ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. జనం వాయిస్,తెలంగాణ డెస్క్: ప్రభుత్వ పథకాలు,అభివృద్ధి పనులను అమలు చేయ టంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని విభాగాల ముఖ్య కార్యదర్శులు,విభాగ అధిపతులను హెచ్చరించారు.ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అలసత్వాన్ని సహించేది లేదన్నారు.ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినప్పటికీ కొందరు అధికారుల పనితీరులో మార్పు లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇప్పటికైనా అలసత్వం వీడాలని సూచించారు.ఎవరికివారు సొంత నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి...