ముత్తారం పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ.
జనం వాయిస్ దినపత్రిక, ముత్తారం:
పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా పోలీస్ వారి ఆధ్వర్యంలో మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించబడుతుందని ముత్తారం ఎస్సై ఎన్ రవికుమార్ తెలిపారు.ఉదయం కాల్వశ్రీరాంపూర్ నుండి బేగంపేట వయా ఇదులపూర్,పోతారం, సర్వారం,లక్కారం, మచ్చుపేట మీదుగా సైకిల్ ర్యాలీ ఉంటుందన్నారు.ఆసక్తి కలిగిన ముత్తారం మండల యువత ఇదులపూర్ క్రాస్ రోడ్డు వద్దకు మంగళవారం ఉదయం 8:00 గంటలకు వచ్చి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరని ముత్తారం ఎస్సై రవి కుమార్ కోరారు.