మృతుని కుటుంబానికి పుట్ట మధుకర్ పరామర్శ.
జనం వాయిస్, మంథని:
మంథని మండలం ఖాన్ సాయిపేట గ్రామంలో గావిడి సూర్యం ఇటీవల మరణించగ వారి కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ పరామర్శించారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకోని సంతాపం వ్యక్తం చేశాడు. మృతుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించాడు. తన వెంట బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.