రహస్యంగా టపాసుల దుకాణాల టెండర్లు.

రహస్యంగా టపాసుల దుకాణాల టెండర్లు.-కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం బాధ్యతలు ఒకే వ్యక్తికి..-టెండర్లు నిర్వహించకుండానే అప్పజెప్పిన వైనం..-నిబంధనలు తుంగలో తొక్కి డబ్బులు వసూలు.జనం వాయిస్, కరీంనగర్: దీపావళి సందర్భంగా బాణసంచా మోత మోగుతుంది. ఈ పర్వదినం రోజున లక్ష్మీ పూజలు నిర్వహించిన తర్వాత ఇళ్లలోనూ.. వ్యాపార సంస్థల సముదాయంలోనూ టపాసులు పేలుస్తుంటారు. దీపావళి రోజున టపాసులు పేల్చడం వల్ల శుభ సూచకమని.. దుష్టశక్తులు రాకుండా ఉంటాయని భావిస్తారు. ఈ సందర్భంగా బాణసంచా కొనుగోలు విపరీతంగా ఉంటాయి. కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగుతూఉంటుంది. వినియోగదారుల డిమాండ్ మేరకు...