రాయితీలు కాదు రాజ్యాధికారం కావాలి.
బీసీ రిజర్వేషన్లపై ప్రజా ఉద్యమాలతో కేంద్రం మెడలు వంచాలి : హిస్సా ఇజ్జత్ హుకుమాత్ పుస్తకావిష్కరణలో రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు. జనం వాయిస్,మహబూబ్‌నగర్: ‘రాయితీలు మాకొద్దు… రాజ్యాధికారం కావాలి. అందుకోసం రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ ఉద్యమాన్ని తలపించేలా ఆందోళనలు చేపట్టాలి. ప్రజా ఉద్యమాలను నిర్మించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలి. పోరాటాల ద్వారానే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు వస్తాయి’ అని హిస్సా ఇజ్జత్ హుకుమాత్ పుస్తక రచయిత రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవివులు అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌లో జరిగిన కార్యక్రమంలో బీసీలకు...