janamvoice.com
Newspaper Banner
Date of Publish : 26 October 2025, 11:50 am Digital Edition : JANAM VOICE

వంతెన డివైడర్ ఢీ కొట్టి బోల్తా పడ్డ కారు.

వంతెన డివైడర్ ఢీ కొట్టి బోల్తా పడ్డ కారు.

జనం వాయిస్ దినపత్రిక:

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కెపిహెచ్‌బి కాలనీ సమీపంలోని జెఎన్‌టియు వంతెనపై ఓ రెడ్ కలర్ కారు బీభత్సం సృష్టించింది ఈ రోజు ఉదయం 7:50 గంటల సమయంలో రైతు బజార్ దాటిన తర్వాత వంతెన పైకి ఎక్కిన కారు ఓవర్ స్పీడ్ తో డివైడర్ నుండి కొట్టి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడినట్టు సమాచారం..పోలీసులు ఘటనా స్థలాని కి చేరుకొని కేసు నమోద చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూడాన్ చెందిన ఇద్దరు యువకులు, ముగ్గురు యువతులు కారులో ఉన్నట్టు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే సూడాన్ దేశస్థులు క్యాబ్ బుక్ చేసుకొని ఘటనా స్థలం నుంచి పారిపోయారు.ప్రమాదానికి కారణమైన కారు అద్దెకు తీసుకున్నారా? లేక ఎవరైనా ఇచ్చారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచ రం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక అంచనా.