వీధి కుక్కల దాడిలో చిరుత పులి మృతి.
జనం వాయిస్, కడప జిల్లా, ఏప్రిల్ 07:
నీటి కోసమో,ఆహారం కోసమో!వచ్చి కుక్కల దాడిలో చిరుత పులి పిల్ల మృతి చెందింది, ఈ ఘట న కడప జిల్లా దువ్వూరు మండలం పరిధి లోని చిన్న బాకరాపురం గ్రామంలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఒక చిరుత పులి పిల్లపై వీధి కుక్కలు మూకుమ్మడి గా దాడి చేయడంతో, ఆ దాడిలో గాయపడిన చిరుత పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆహారం లేదా నీటి కోసం అటవీ ప్రాంతం నుండి జనావాసాల్లోకి వచ్చిన చిరుత పిల్లను చూసిన కుక్కలు ఒక్కసారిగా దానిపై విరుచుకుపడ్డాయి. చిరుత పిల్ల చిన్నది కావడంతో కుక్కల దాడిని తట్టుకోలేక ప్రాణాలు వదిలింది. ఉదయాన్నే పొలాలకు వెళ్లే రైతులు మృతదేహాన్ని గమనించి గ్రామస్తులకు మరియు అటవీ శాఖాధికా రులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. “పిల్ల చిరుత ఇక్కడికి వచ్చిందంటే, దాని తల్లి చిరుత కూడా సమీపం లోనే ఉండే అవకాశం ఉంది అన్నారు.రైతులు పంట పొలాల వద్దకు ఒంటరిగా వెళ్లకూడదని ఫారెస్ట్ అధికారులు హెచ్చరిస్తున్నారు.